schedule Friday, September 11, 2026

రైతులకు వన్నెతెచ్చే సేవలందించాలి

calendar_today July 6, 2024
person dharshininews
రైతులకు వన్నెతెచ్చే సేవలందించాలి
రైతులకు వన్నెతెచ్చే సేవలందించాలి - కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - కొత్త పాలకవర్గానికి అభినందనలు, సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులకు వన్నె తెచ్చే సేవలు అందించాలని తాండూరు మార్కెట్ కమిటి కొత్త పాలకవర్గానికి తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తాండూరు మార్కెట్ కమిటి కొత్త పాలకవర్గాన్ని నియమించిన సంగతి తెలిసిందే. మార్కెట్ కమిటి కొత్త చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, డైరెక్టర్లు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి చైర్మన్, డైరెక్టర్లను అభినందించి.. సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటి కొత్త పాలకవర్గం అంకిత భావంతో పనిచేయాలన్నారు. రైతుల అభివృద్ధి, వారికి వన్నె తెచ్చే సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు, యాలాల మండల రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/27591/