schedule Tuesday, July 07, 2026

వారాహీ దేవీ నమోస్తుతే..!

calendar_today July 6, 2024
person dharshininews
వారాహీ దేవీ నమోస్తుతే..!
వారాహీ దేవీ నమోస్తుతే..! - వైభవంగా నవరాత్రుల ఉత్సవాలు - వాసవీ సంఘం ఆధ్వర్యంలో పూజలు - దర్శించుకున్న చైర్ పర్సన్‌ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీ వారాహీ దేవి నమోస్తుతే అంటూ భక్తులు అమ్మవారిని కొలిచారు. ఆషాడం మాసం సందర్భంగా వారాహీ దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో ఉత్సవాలను ప్రారంభించారు. సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ హాజరయ్యారు. వాసవీ సంఘం మహిళ సభ్యులు, భక్తులతో కలిసి చైర్ పర్సన్ అమ్మవారిని పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వారాహీ మాత అంటే భూదేవి, ధాన్యలక్ష్మిలకు ప్రతిరూపం అని అన్నారు. ఆషాడ మాసంలో వారాహీ అమ్మవారి నవరాత్రులు ఎంతో పవిత్రమైనవని అన్నారు. నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే నరదోషాలు, ఇతర దోషాలు తొలగిపోతాయన్నారు. వారాహిదేవిని పూజించడం వల్ల అభివృద్ధి కలిగి, సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చన్నారు. నవరాత్రి ఉత్సవాలో అమ్మవారిని దర్శించుకోవడం మాహాభాగ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరేశ్వర దేవాలయ చైర్మన్ కుంచెం మురళీధర్, వాసవీ మహిళ సంఘం నాయకురాలు మంకాల స్వప్న, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/27595/