schedule Tuesday, July 07, 2026

రైతు సేవలే లక్ష్యంగా..!

calendar_today July 6, 2024
person dharshininews
రైతు సేవలే లక్ష్యంగా..!
రైతు సేవలే లక్ష్యంగా..! - ఉత్తమ సేవలను అందించండి - కొత్త పాలకవర్గంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ గా సాయిపూర్ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్గా నర్సిరెడ్డి, డైరెక్టర్లు నియామకం అయిన సంగతి తెలిసిందే. కొత్తగా నియాకమకమైన పాలకవర్గ సభ్యులు శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పదవులు వచ్చేలా చూసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపి సన్మానించారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొత్త పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ కమిటి ద్వారా రైతులకు ఉత్తమ సేవలను అందించాలన్నారు. మార్కెట్ లో దళారీ వ్యవస్థ లేకుండా, రైతులకు ఎలాంటి నష్టాలు కలగకుండా చూడాలన్నారు. రైతులకు సేవే లక్ష్యంగా పనిచేసి మార్కెట్ కమిటిని ఆదర్శంగా నిలపాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు, యాలాల డైరెక్టర్లు, ఆయా మండల రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27601/