schedule Tuesday, July 07, 2026

డేంజర్.. వాటర్..!

calendar_today July 13, 2024
person dharshininews
డేంజర్.. వాటర్..!
డేంజర్.. వాటర్..! - మిషన్‌ భగీరథలో వానపాములు - నీటీ సరఫరాపై బెంబేలెత్తిన జనం - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరా డేంజర్‌గా మారింది. ఇంటింటికి చేసిన సరఫరాలో వానపాములు దర్శనమిచ్చాయి. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరులో వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని శాంతినగర్‌ ప్రాంతంలో సరఫరా అయిన మిషన్ భగీరథ నీటిలో వాన పాములు, జెర్రిలు కనిపించాయి. గమనించిన స్థానికులు బెంబేలెత్తిపోయారు. వాన పాములు ఉన్న నీటిని సరఫరా చేస్తే ఎలా తాగేది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో లీకేజీలు కావడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు లీకేజీ వల్ల నుంచి వానపాములు, జెర్రీలు పైపులైన్‌లలో చేరి కుళాయిలకు సరఫరా అవుతున్నాయని అంటున్నారు. లీకేజీల మరమ్మత్తులు అధికారులు నిర్లక్ష్యం వల్లే డేంజర్ వాటర్ సరఫరా అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27718/