schedule Tuesday, July 07, 2026

భక్తి ప్రపత్తులతో మొహరం..!

calendar_today July 17, 2024
person dharshininews
భక్తి ప్రపత్తులతో మొహరం..!
భక్తి ప్రపత్తులతో మొహరం..! - పల్లెల్లో, పట్టణంలో వెల్లివిసిరిన ఐక్యత - షహదత్‌ ఉత్సవాలతో వీడ్కోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మత సామరస్యానికి ప్రతీకగా, హిందూ ముస్లింలు కలిసి జరుపుకొనే మొహర్రం వేడుకలు తాండూరు నియోజకవర్గంలోని పట్టణంలో, పల్లెల్లో అత్యంత భక్తి ప్రపత్తులతో జరిగాయి. మంగళవారం, బుధవారం పీర్ల పండగ సందడి ఏర్పడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ముజావర్లు ప్రతీరోజూ ప్రత్యేక పూజలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పూలు, ఊదు, బెల్లం, దట్టీలు సమర్పించుకుంటూ మొక్కులు చెల్లిస్తుండడంతో అంతటా సందడి సంతరించుకుంది. బుధవారం సాయంత్రం మొహరం వేడుకలు భక్తి ప్రపత్తులతో ముగిశాయి. గ్రామాల్లో అలయ్‌ ముందు డప్పు వాయిద్యాలతో చేసిన బలాయ్ ఆట, పాట నృత్యాలు ఆకట్టుకున్నాయి.తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న పీర్లకు షహదత్ ఉత్సవాలతో పండగకు ముగింపు పలికారు. ప్రతీ సంవత్సరం వీరి త్యాగాన్ని స్మరిస్తూ మొహర్రం గీతం అల్విదాను పలికి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఉత్సవాలలో పట్టణంలో, పల్లెల్లో హిందూ ముస్లింలు పాల్గొని మతసామరస్యతను చాటుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27770/