schedule Tuesday, July 07, 2026

దత్తాత్రేయ స్వామికి మహా నైవేద్యం

calendar_today July 21, 2024
person dharshininews
దత్తాత్రేయ స్వామికి మహా నైవేద్యం
దత్తాత్రేయ స్వామికి మహా నైవేద్యం - విఠల్ నాయక్‌కు దక్కిన భాగ్యం - కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం గానుగాపూర్‌లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామికి మహా నైవేద్యం సమర్పించే భాగ్యాన్ని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్‌ నాయక్‌కు దక్కింది. ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా విఠల్‌ నాయక్ కుటుంబంతో కలిసి దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి సమర్పించే మహా నైవేధ్యం సమర్పరణ భాగ్యం వేలాది భక్తుల్లో ఒకరికి దక్కుతుంది. ఆ భాగ్యాన్ని విఠల్ నాయక్‌ దక్కింది. దీంతో వేద పండితులాధ్వర్యంలో విఠల్ నాయక్‌ స్వామి వారికి మహా నైవేధ్యాన్ని సమర్పించారు. అనంతరం ప్రతి పౌర్ణమి మాదిరిగానే గురుపౌర్ణమి సందర్భం గా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలని సూచించారు. అదేవిధంగా అన్నదాన సేవతో స్వామివారి కృపను పొందే భాగ్యం తనకు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వర్య్త కిష్టమ్మ, వర్య్త ప్రశాంతి, వర్య్త రవికుమార్, ఆలయపూజారులు, భక్తులు, తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27868/