schedule Friday, September 11, 2026

మృతుడి కుటుంబంపై మానవత్వం

calendar_today September 15, 2024
person dharshininews
మృతుడి కుటుంబంపై మానవత్వం
మృతుడి కుటుంబంపై మానవత్వం - ఆర్థిక సాయం అందజేసిన గ్రామస్తుడు తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబంపై మానవత్వం చాటుకున్నారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.నియోజకవర్గంలోని బషీరాబాద్‌ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన సంకూరు రాములు(బియ్యం) గ్రామంలోని రేషన్ డీలర్ల వద్ద బియ్యం వేసే పనులు చేసేవాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాములు శనివారం మృతి చెందాడు. దీంతో తలారీ ముణెప్ప కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సాయం అందజేశారు. పేద కుటుంబానికి చెందిన రాములు కుటుంబాన్ని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/29101/