schedule Wednesday, July 08, 2026

దొంగిలించి.. దర్జాగా వాడేశాడు..!

calendar_today November 8, 2024
person dharshininews
దొంగిలించి.. దర్జాగా వాడేశాడు..!
దొంగిలించి.. దర్జాగా వాడేశాడు..! - ఇంటిముందు పార్కింగ్ చేసిన బైకు చోరీ - నిందితున్ని రిమాండుకు తరలించిన పోలీసులు - వివరాలను వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దొంగిలించిన బైకును దర్జాగా వాడుతున్న దొంగ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు మండలంలోని ఓగిపూర్ గ్రామానికి చెందిన చవాన్ రవి అనే వ్యక్తి గురువారం రాత్రి 11 గ్రామంలోని తన ఇంటి ముందు మోటారు బైకు (ఏపీ28 బీడీ 9307)ను పార్కింగ్ చేసి ఇంట్లో నిద్రించాడు. తెల్లవారు జామున లేచి చూసే సరికి బైకు కనిపించలేదు. దీంతో కరణ్ కోట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కరణ్ కోట్ కు చెందిన వడ్డె కాశప్ప అనే వ్యక్తి బైకును నడిపిస్తూ పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించాడు. వడ్డె కాశప్పపై గతంలో రెండు దొంగతనం కేసులు, ఒక యాక్సిడెంట్ కేసు ఉండడంతో అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30425/