schedule Sunday, September 13, 2026

తాండూరులో బీజేపీ నేతల జోష్...!

calendar_today November 24, 2024
person dharshininews
తాండూరులో బీజేపీ నేతల జోష్...!
తాండూరులో బీజేపీ నేతల జోష్...! - మహారాష్ట్రలో గెలుపుపై సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహరాష్ట్రలో బీజేపీ గెలుపుపై తాండూరులో ఆ పార్టీ నేతలు సంబరాలను జోష్ ఫుల్ గా జరుపుకున్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంబరాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బాలి శివకుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ దేశంలో బీజేపీ సంక్షేమ, అభివృద్ధి పాలన, ప్రధాని మోడి నాయకత్వం మహారాష్ట్రలో బీజేపీ గెలుపుకు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఫలించలేదన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇంచార్జ్ రజనీకాంత్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకులు, యువకులు తదితరలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/30762/