schedule Sunday, September 13, 2026

బోనమ్మను దర్శించుకున్న మనోహర్ రెడ్డి

calendar_today November 26, 2024
person dharshininews
బోనమ్మను దర్శించుకున్న మనోహర్ రెడ్డి
బోనమ్మను దర్శించుకున్న మనోహర్ రెడ్డి - పాత తాండూరు ఆలయంలో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వెలసిన శ్రీ బోనమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. గత మూడు రోజులుగా ఆలయంలో అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృపా కటాక్షాలు అందించాలని, అందరిపై ఆశీస్సులు మెండుగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు డా.సంపత్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, కలాల్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30836/