మార్మోగిన శరణు గోస..!
November 27, 2024
dharshininews
మార్మోగిన శరణు గోస..!
- వైభవంగా అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం
- శోభాయామానంగా పల్లకి సేవ ఊరేగింపు
- ఆకట్టుకున్న విద్యార్థుల కళా ప్రదర్శనలు
- దర్శించుకున్న ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో శరణు గోస మార్మోగింది. బుధవారం పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రథంలో స్వామి వారి విగ్రహా ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప నగర్, గ్రీన్ సిటీ, పాత తాండూరు, మార్వాడి బజార్, భద్రేశ్వర చౌక్, గాంధీ చౌక్, నెహ్రు గంజ్, ఇందిరా చౌక్, బస్టాండ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. ఊరేగింపు ముందు అయ్యప్ప స్వాముల భజన కీర్తనలు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
స్వామి ఊరేగింపులో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివార్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కన్నె స్వాములతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహాకారం అందిస్తానని అన్నారు. అదేవిధంగా ఆలయంలో రాత్రి పద్దెనిమిది పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భజన కీర్తనలు, శరణు గోసతో ఆలయం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, గురుస్వాములు, స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/30862/