schedule Sunday, September 13, 2026

భద్రేశ్వర దేవాలయ చైర్మన్ గా పటేల్ కిరణ్ కుమార్

calendar_today November 28, 2024
person dharshininews
భద్రేశ్వర దేవాలయ చైర్మన్ గా పటేల్ కిరణ్ కుమార్
భద్రేశ్వర దేవాలయ చైర్మన్ గా పటేల్ కిరణ్ కుమార్ - ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ - ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర దేవాలయ(పునరుద్ధరణ కమిటి) చైర్మన్ గా యువనాయకులు పటేల్ కిరణ్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్ గా పటేల్ కుమార్ తో పాటు సభ్యులుగా జాక సంగమేశ్వర్, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, గాండ్ల వీరణ్ణ, కల్లూరు బస్వరాజ్, కోటం సిద్ధలింగం, ఎం. ప్రశాంత్ కుమార్, గడ్డి కిరణ్ కుమార్ లను నియమించారు. ఈ సందర్భంగా చైర్మన్ గా నియామకమైన పటేల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ పదవికి నామినేట్ చేయడం పట్ల తాండూరు ఎమ్మెలె నవ్య మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దేవాలయ అభివృద్ధితో పాటు పదవికి వన్నె తెచ్చే విధంగా శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ఇందుకు ఆలయ కమిటి సభ్యులు అందరి సహాకారం అందించాలని కోరారు. మరోవైపు నూతనంగా నియామకమైన ఆలయ కమిటి చైర్మన్, సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30949/