schedule Wednesday, July 08, 2026

మరుపురాని నేత నాగారం నర్సింలు

calendar_today November 28, 2024
person dharshininews
మరుపురాని నేత నాగారం నర్సింలు
మరుపురాని నేత నాగారం నర్సింలు - తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ - కోత్తపల్లిలో నివాళులు అర్పించిన చైర్ పర్సన్ - కుటుంబ సభ్యులకు పరామర్శ, సానుభూతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్, స్వర్గీయ నాగారం నర్సింలు ప్రజల మనస్సుల్లో మరుపురాని నేతగా ఉంటారని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం కోట్‌పల్లి మండలం కొత్తపల్లిలో స్వర్గీయ నాగారం నర్సింలు దినకర్మ నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై నాగారం నర్సింలు చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సతీమణి జగదాంబను కోడళ్లు, కూతురు, కుమారులను కలిసి పరామర్శించారు. నర్సింలు మరణం పట్ల సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్‌గా నాగారం నర్సింలు చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లో మచ్చలేని నాయకుడుగా నిలిచారని అన్నారు. ప్రజల మనస్సుల్లో మరుపురాని నేతగా నిలుస్తారని కొనియాడారు. ఆయన స్పూర్తిని కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ ప్రవీణ్‌ గౌడ్, యువనాయకులు భాను, తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30975/