schedule Wednesday, July 08, 2026

ప్రజాధనం దుర్వినియోగం చేయనీయొద్దు..!

calendar_today November 29, 2024
person dharshininews
ప్రజాధనం దుర్వినియోగం చేయనీయొద్దు..!
ప్రజాధనం దుర్వినియోగం చేయనీయొద్దు..! - అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయించండి - మున్సిపల్ చైర్ పర్సన్‌కు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : అవసరమైన చోట పనులు చేపట్టకుండా.. అవసరం లేని చోట పనులు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని తాండూరు బీజేపీ నాయకులు సుదర్శన్ గౌడ్, యశోధ నగర్ కాలనీ వాసులు డిమాండ్ చే శారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ పట్టణంలోని యశోధనగర్ లో ఉన్న కోర్టు ప్రహారికి ఆనుకుని ఉన్న రోడ్డు అసంపూర్తిగా మిగిలిపోయిందని తెలిపారు. ఇక్కడ రోడ్డు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయితే వార్డులో అవసరం లేని మరో ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో వార్డు కౌన్సిలర్ దరుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కావున అవసరం లేని ప్రాంతంలో చేపడుతున్న పనులు ఆపి.. బిల్లులను నిలివేయాలని.. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. యశోదనగర్‌లో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు పూర్తి చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30986/