schedule Tuesday, July 07, 2026

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో నిర్లక్ష్యం తగదు..!

calendar_today January 6, 2025
person dharshininews
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో నిర్లక్ష్యం తగదు..!
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో నిర్లక్ష్యం తగదు..! - వారంలోపు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి - వార్డు ఆఫీసర్లతో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని 36 వార్డుల నుంచి లబ్దిదారుల వచ్చిన దరఖాస్తుల నమోదుపై సవి లక్షించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. వారం రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కమీషనర్ మీడియాతో మాట్లాడుతూ తాండూరు పట్టణంలో సుమారు 12వేల 800ల దరఖాస్తులు అందాయన్నారు. ఇప్పటి వరకు 75శాతం సర్వే పూర్తియ్యిందని, కమీషనర్లకు ఆదేశించిన సూపర్ చెక్ పక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేధిక అందిస్తామన్నారు. మరోవైపు పట్టణంలో చేపట్టిన సమగ్ర కుల, ఇంటింటి సర్వే ఆన్ లైన్ లో నమోదు చేయడం పూర్తయ్యిందన్నారు. అదేవిధంగా పట్టణంలో వీధికుక్కలకు ఆపరేషన్లు చేయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 300ల మగ వీధి కుక్కలకు ఆపరేషన్లు చేయించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, అధికారులు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32047/