schedule Monday, July 06, 2026

రూ.10.21 లక్షలకు తైబజార్ వేలం

calendar_today April 4, 2025
person dharshininews
రూ.10.21 లక్షలకు తైబజార్ వేలం
రూ.10.21 లక్షలకు తైబజార్ వేలం - స్లాటర్ హౌజ్, బీఫ్ వేలంకు స్పందన - మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన తైబజార్, స్లాటర్ హౌజ్, బీఫ్ ల వేలంకు స్పందన లభించినట్లు కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో కార్యాలయంలో తైబజార్, స్లాటర్ హౌజ్, బీఫ్ ఫీజుల వసూళ్లకు వేలం నిర్వహించారు. ఇందులో తైబజార్ ఫీజులపై ముజీమ్ అనే వ్యక్తం రూ. 10లక్షల 21 వేల 500లకు దక్కించుకున్నట్లు కమిషనర్ తెలిపారు. అదేవిధంగా స్లాటర్ హౌజ్ ఫీజులకు ఆజమ్ అనే వ్యక్తి రూ.53 వేలకు దక్కించుకోగా.. మటన్, బీఫ్ ఫీజులకు రూ.61 వేలకు ఇతర వ్యక్తి దక్కించుకున్నట్లు వెల్లడించారు. వేలంలో పాడిన డబ్బులను 1/3 వంతు 7రోజుల్లో చెల్లించేందుకు అవకాశం ఉంటుందని, మిగతా బకాయిలు డిసెంబర్ లోగా చెల్లించేందుకు గడువు ఉంటుందని వివరించారు. వేలం దక్కించుకున్న వారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఫీజులు వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గత కొన్నేండ్ల క్రితం తైబజార్ ఫీజుల వసూలు లేదని, తాజాగా అమల్లోకి తెచ్చిన తైబజార్ ఫీజులకు వ్యాపారులు సహకరించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34496/