schedule Monday, July 06, 2026

నేత్ర పర్వంగా సీతారాముల పెండ్లి..!

calendar_today April 6, 2025
person dharshininews
నేత్ర పర్వంగా సీతారాముల పెండ్లి..!
నేత్ర పర్వంగా సీతారాముల పెండ్లి..! - మిత్రానగర్‌లో ఘనంగా శ్రీరామ నవమి - భారీగా పాల్గొన్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని మిత్రానగర్‌ కాలనీలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్బంగా కాలనీలోని అమ్మ భగవాన్ ఆలయ ప్రాంగణంలో హిందువుస్వా కమిటి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిపించారు. ప్రత్యేకంగా పందిరి వేసి.. సీతారాములకు ప్రత్యేక అలంకరణ చేశారు. పంతులు వంశీధర్ కులకర్ణి సమక్షంలో వేద మంత్రాలు పఠించగా ఆలయానికి వచ్చిన భక్తులు తన్మయంతో సీతారాముల నామ స్మరణను మార్మోగించారు. శ్రీరాముడు సీత మెడలో మాంగల్య ధారణ చేయగా భక్తులంతా పరవశించి పోయారు. శ్రీరామ నవమి రోజున కళ్యాణోత్సవ ఘట్టంతో దేవాలయ ప్రాంగణతో పాటు కాలనీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కళ్యాణోత్సవం అనంతరం నిర్వహకులు భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరసింహులు గౌడ్, సహాయ కార్యదర్శి గోపాల్, కోశాధికారి హర్షవర్ధన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు గోవిందరావు, అంజయ్య గౌడ్, కాలనీ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34546/ [embed]https://www.dharshininews.com/34560/[/embed]