schedule Monday, July 06, 2026

అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయండి

calendar_today April 7, 2025
person dharshininews
అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయండి
అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయండి - 14న భీమ్ రాలీలో భారీగా పాల్గొనాలి - పిలుపునిచ్చిన జై భీమ్ ఉత్సవ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయాలని తాండూరు జై భీమ్ ఉత్సవ కమిటి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని పూలే పార్కులో అంబేద్కర్ జయంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి కోసం అడాక్ కమిటిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తాండూరులో జై భీమ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ర్యాలీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీతో అంబేద్కర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకవెళ్లి దళిత బహుజన వర్గాల్లో ఐక్యతను చాటాలని కోరారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/34612/