schedule Monday, July 06, 2026

బీఆర్ఎస్ రజతోత్సవం భారీ రికార్డ్..!

calendar_today April 29, 2025
person dharshininews
బీఆర్ఎస్ రజతోత్సవం భారీ రికార్డ్..!
బీఆర్ఎస్ రజతోత్సవం భారీ రికార్డ్..! - కారు దెబ్బకు మతిభ్రమించిన కాంగ్రెస్ - ఓర్వలేక తప్పుడు ప్రచారాలు - మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే - తాండూరు నాయకులు పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయి రికార్డు సృష్టించిందని ఆ పార్టీ తాండూరు సీనీయర్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ వరంగల్ లో జరిగిన సభకు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు భారీగా తరలివెళ్లారని అన్నారు. కేసీఆర్ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా భారీగా తరలివెళ్లి సభను జయప్రదం చేశారని అన్నారు. కారు సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలకు మతిబ్రమించిందని అన్నారు. అనుకున్నదాని కన్నా, పార్టీ అధికారంలో లేకున్నా భారీ ఎత్తున ప్రజలు నిరాజనాలు పలకడంతో మింగుడు పడలేని కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉనికి కోల్పోతామన్న భయంతో సభ పేయిల్ అయ్యిందంటూ వాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సభలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోయిందన్నారు. బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను చాటుకున్నారని, ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. చేతగాని హామీలు ఇచ్చి.. అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను కరువు రాష్ట్రంగా మార్చిందన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35255/