schedule Monday, July 06, 2026

సన్మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు..!

calendar_today April 30, 2025
person dharshininews
సన్మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు..!
సన్మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు..! - బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలి - జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ - బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బసవ జయంతి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజానికి సనార్గం చూపిన మార్గదర్శి మహాత్మ బసవేశ్వరుడు అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అభివర్ణించారు. బుధవారం 'బసవ' జయంతిని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బసవేశ్వరుని ప్రవచనాలు, మానవత సూత్రాలు, విశ్వమానవ సౌబ్రాతృత్వము, సమానత్వం, మానవ మనుగడకు సమాజ హితానికి ఎంతగానో దోహదం చేశాయని అన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలిచిన బసవేశ్వరుని జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ బస్వరాజ్ , మహిళా అధ్యక్షురాలు అనిత, నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి జగదీశ్వరి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సగర, తాండూరు బీసీ యువ నాయకుడు రాము ముదిరాజు, బషీరాబాద్ మండల అధ్యక్షుడు నరేందర్, బీసీ నాయకులు బాబా గౌడ్ బీసీ యువజన సంఘం పెద్దేముల్ అధ్యక్షులు బంగారు నవీన్, బీసీ సంఘం నాయకులు గోపి, కిరణ్, రాజు, అరుణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35291/