schedule Thursday, September 10, 2026

అపూర్వ కలయిక..!

calendar_today May 1, 2025
person dharshininews
అపూర్వ కలయిక..!
అపూర్వ కలయిక..! - ఒకే వేధికపై పూర్వ విద్యార్థులు - 20 ఏండ్ల తరువాత పెద్దేముల్ జెడ్పీహెచ్ఎస్‌లో సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపంగా జరిగింది. పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదే పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 20 ఏండ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలలో మైమరిచి పోయారు. అప్పడు చదువు చెప్పిన ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు ఎల్లారెడ్డి, వీణ, విద్యావతి, ఝాన్షీ, యశోదర, విజయలక్ష్మీలను గురుతర బాధ్యతగా భావించి సన్మానించారు. తీపి గుర్తుగా మెమెంటోలను అందజేశారు. టీచర్లు జీవితంలో స్థిరపడిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆట పాటలతో సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35382/