schedule Monday, July 06, 2026

వాటర్‌ ఫిల్టర్ వ్యాపారులకు హెచ్చరిక

calendar_today May 9, 2025
person dharshininews
వాటర్‌ ఫిల్టర్ వ్యాపారులకు హెచ్చరిక
వాటర్‌ ఫిల్టర్ వ్యాపారులకు హెచ్చరిక - నిబంధనల అమలుకు 3నెలల గడువు - ఆ తరువాత అది లేకుంటే సీజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు పట్టణంలోని వాటర్ ఫిల్టర్ వ్యాపారులకు మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని అన్ని వాటర్ ఫిల్టర్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని వాటర్ ఫిల్టర్‌లకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించడం జరిగిందని కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. కావున వ్యాపారులు మూడు నెలల్లోపు వాటర్ ఫిల్టర్లకు గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. లేదంటే తరువాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో పాటు ఫిల్టర్ల వద్ద వినియోగించే డబ్బాలను ఆరు నెలలకోసారి మార్చుకోవాలని అన్నారు. వాటర్ ఫిల్టర్ తరువాత నీరు వృధాగా పారకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35447/