schedule Monday, July 06, 2026

పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా సర్వే

calendar_today May 17, 2025
person dharshininews
పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా సర్వే
పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా సర్వే - నిబంధనలకు అనుగుణంగా అర్హుల ఎంపిక - తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి సూచించారు. శనివారం కార్యాలయంలోని తన చాంబర్ లో వార్డు ఆఫీసర్లతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్ పథకం సర్వే అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీలు అందజేసిన ఇందిరమ్మ ఇండ్ల జాబితా సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు. అదేవిధంగా ఈనెల 19వ తేది లోపు రాజీవ్ యువ వికాసంలో సిబిల్ స్కోర్ ద్వారా లబ్దిదారుల గుర్తింపును పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించాలన్నారు. దీంతో పాటు పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై దృష్టిసారించాలని ఆదేశించారు. ఏ మైనా సమస్యలు ఉంటే ఇంజనీరింగ్ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35577/