schedule Friday, July 10, 2026

ఆస్తిపన్ను బ‌కాయిలు చెల్లించిన డీసీఎంఎస్

calendar_today August 1, 2022
person dharshininews
ఆస్తిపన్ను బ‌కాయిలు చెల్లించిన డీసీఎంఎస్
ఆస్తిపన్ను బ‌కాయిలు చెల్లించిన డీసీఎంఎస్ - 90 శాతం వడ్డీ రాయితీ కింద రూ.14 లక్షల చెల్లింపు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని డీసీఎంఎస్ కార్యాలయంపై ఉన్న ఆస్తిపన్నుల బకాయిలను అధికారులు చెల్లించారు. సోమవారం మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి రూ. 14లక్షల 23 వేల 520లను అంద‌జేశారు. 2022 సంవత్సరం మార్చి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లిస్తే వడ్డీపై 90శాతం రాయితీ కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాండూరు డీసీఎంఎస్ కార్యాల‌యంపై రూ. 22లక్ష‌ల 12 వేల 606ల బ‌కాయిలు ఉండ‌గా 90 శాతం వ‌డ్డీ రాయితీ ద్వారా అధికారులు దాదాపు రూ. 7 లక్షల రాయితీతో రూ. 14 లక్షల నగదును చెల్లించినట్లు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు