schedule Thursday, July 09, 2026

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

calendar_today July 9, 2026
person dharshininews
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య - వాట్సప్ స్టేటస్ లో సారి అంటూ మెసేజ్ - తాండూరులో పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణం ఇందిరా నగర్ కు చెందిన కార్తీక్ గౌడ్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు ఆరా తీసి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడు ప్రేమ విషయంలో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. చనిపోయే ముందు తన వాట్సాఫ్ స్టేటస్ లో సారి అని మెసేజ్ పెట్టడం కలచి వేసింది. మరోవైపు యువకుడి ఆత్మహత్యపై కుటుంభికులు అనుమానాలు వ్యక్తం చేశారు. https://www.dharshininews.com/43727/