schedule Wednesday, July 08, 2026

ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి

calendar_today July 8, 2026
person dharshininews
ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి
ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి - నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి - సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తాండూరు, దర్శిని ప్రతినిధి : దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై రాజశేఖర్ రెడ్డి జయంతిని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌ అమర్‌ రహై అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా రైతు భరోసా ఫథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.6000 పంట పెట్టుబడి సహాయం అందించిన సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం స్వర్గీయ వైఎస్‌ఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి చిరస్మరణీయంగా నిలిచారని కొనియాడారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతులు, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధారసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నర్సింహులు, పట్టణ అధ్యక్షులు నాగరాజు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, పలువురు సీనియర్ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43721/