schedule Wednesday, July 08, 2026

విద్యారంగం నిర్లక్ష్యంను సహించేది లేదు

calendar_today July 8, 2026
person dharshininews
విద్యారంగం నిర్లక్ష్యంను సహించేది లేదు
విద్యారంగం నిర్లక్ష్యంను సహించేది లేదు - వామపక్షాల రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘం సంపూర్ణ మద్దతు - జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ - ఈ నెల 10న తాండూర్‌లో విద్యాసంస్థల బంద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగంపై సర్కారు నిర్లక్ష్యాన్ని సహించేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరులో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, పెండింగ్‌లో ఉన్న విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న వామపక్ష పార్టీలు, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు, పెరుగుతున్న విద్యా ఖర్చులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ నెల 10న జరిగే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని, విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాలు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, వడ్డెర సంఘం జిల్లా నాయకులు వడ్డే సత్యనారాయణ, మహిళా నాయకులు అనిత, నరసమ్మ, మంజుల, జగదీశ్వరి, మంబాపూర్ మంజుల, మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, తాండూరు అధ్యక్షుడు బసంత్, యువ నాయకులు జోసఫ్, రాము ముదిరాజ్, పరమేష్, టైలర్ రమేష్, గోపాల్, నరసింహ, మంతటి రాజు, సురేష్, యాసర్, వినయ్, కిరణ్, శ్రవణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43719/