schedule Saturday, September 05, 2026

కాంగ్రెస్‌కు పోలీస్‌ యాక్టు లెక్కలేదా..!

calendar_today July 8, 2026
person dharshininews
కాంగ్రెస్‌కు పోలీస్‌ యాక్టు లెక్కలేదా..!
కాంగ్రెస్‌కు పోలీస్‌ యాక్టు లెక్కలేదా..! - చట్టాన్ని తుంగలో తొక్కి బహిరంగ సభలు - పోలీసుల ప్రేక్షక పాత్ర దారుణం, డీజీపీకి ఫిర్యాదు చేస్తాం - ఎమ్మెల్యేకు చేరికలపై ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదు - బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు చట్టాలంటే అధికార పార్టీకి లెక్కలేదా అంటూ బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాండూరు పట్టణంలోని గుండుపీర్లు దగ్గర బార్ధాన్ వ్యాపారి ఖాసీం, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో అమలులో ఉన్న పోలీస్ యాక్ట్ (సెక్షన్ 30 )ను కాంగ్రెస్ పార్టీ బేఖాతరు చేస్తూ బహిరంగంగా కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. ఇది పూర్తిగా చట్ట ఉల్లంఘనేనని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమని అన్నారు. చట్టాలపై బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీకి మరో న్యాయం అమలు చేస్తున్నారంటూ ఆయన పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజలకు అభివృద్ధి చూపించలేక, జాయినింగ్స్‌ను ప్రచార ఆయుధంగా మార్చుకోవడం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని ఆరోపించారు. తాండూరు ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. అబద్ధపు హామీలు, రాజకీయ ప్రలోభాలతో ప్రజలను ఎప్పటికీ మోసం చేయలేరని అన్నారు. https://www.dharshininews.com/43723/