బురద జల్లడమే బీఆర్ఎస్ పని..!
July 9, 2026
dharshininews
బురద జల్లడమే బీఆర్ఎస్ పని..!
- అనుమతులతోనే చేరికల సభ
- తెలివిలేని రాజకీయాలు మానుకోవాలి
- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు
తాండూరు, దర్శిని ప్రతినిధి : లేనిపోని విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడమే పనిగా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు అన్నారు.
గురువారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పోలీసు యాక్టును విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలను ఖండించారు. అనుమతులు లేకుండా చేరికలు చేపట్టారని అనడం అవాస్తమని అన్నారు. చేరికలకు ముందురోజే పోలీసులు అనుమతులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు.
చలాన్ కట్టి అనుమతులు తీసుకున్న తరువాతే కార్యక్రమం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ చట్టాన్ని ఉల్లంఘించిందని రాద్దాంతం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడమే బీఆర్‌ఎస్ పార్టీ పనిగా పెట్టుకుందని అన్నారు.
ఏ విషయంలోనూ ఓర్వలేనితనంతో రాజకీయాలు చేస్తుందని అన్నారు. రేపు చేపట్టే విద్యాసంస్థల బంద్‌పై కూడా పోలీసు యాక్టు ఉల్లంఘించిందని విమర్శలు చేయొచ్చని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలివిలేని రాజకీయాలు మానుకోవడం మంచిదని హితవు పలికారు.
https://www.dharshininews.com/43725/