చెత్తపై చిత్తశుద్ది..!
July 9, 2026
dharshininews
చెత్తపై చిత్తశుద్ది..!
- సొంత ఖర్చులతో డబ్బాల ఏర్పాటు
- రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ చొరవ
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలనీలో చెత్త వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకూడదని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్ చిత్తశుద్దిని చాటుకున్నారు.
తాండూరు పట్టణం తన 8వ వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో సొంత ఖర్చులతో చెత్త డబ్బాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం రాజీవ్ కాలనీలో డబ్బాల ఏర్పాటు పనులు చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ, రాజీవ్ కాలనీలో పారిశుద్ధ్యంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కాలనీలలో 10 చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.
అదేవిధంగా రాజీవ్, ఇందిరమ్మ కాలనీలపై ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్‌లకు శ్రద్ద లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేవలం మాటలకే పరిమితం అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్, యువకులు, పెద్దలు తదితరులు ఉన్నారు.
https://www.dharshininews.com/43733/