ఎస్‌ఐఆర్‌కు హెల్ప్ డెస్క్‌లు..!
July 9, 2026
dharshininews
ఎస్‌ఐఆర్‌కు హెల్ప్ డెస్క్‌లు..!
- సందేహాల నివృత్తికి ప్రత్యేక ఏర్పాట్లు
- గడువుకు ముందే ఫారాలు అందించాలి
- తాండూరు ఆర్డీఓ అనిత
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడానికి ఎస్‌ఐఆర్‌కు ప్రత్యేక హెల్ప్ డెస్క్(సహాయక కేంద్రాలు)లు ఏర్పాటు చేయడం జరిగిందని తాండూరు ఆర్డీఓ అనిత తెలిపారు.
గురువారం తాండూరు పట్టణంలోని వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కేంద్రాలను పరిశీలించారు. బీఎల్‌ఓలు, సిబ్బందితో మాట్లాడి ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అనిత మాట్లాడుతూ చాలా మందికి ఎన్యుమరేషన్ ఫారాలను నింపడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పట్టణంలోని వివిధ వార్డులలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడం జరుగుతుందని తెలిపారు. ఫారాల నమోదులో ఓటర్లకు ఎవరికైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్‌లను సందర్శించవచ్చని అన్నారు. అందుబాటులో ఉన్న బీఎల్‌ఓలు, సిబ్బందిని అడిగి ఫారాలను భర్తి చేసుకోవచ్చన్నారు. ఈ కేంద్రాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఫారాలను తీసుకున్న ఓటర్లు పూర్తి చేసినా కూడా అందించడం లేదని, అలాంటి నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. ఎంత త్వరగా అందిస్తే డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఓటర్లు పూర్తి చేసిన ఫారాలను నిర్ణీత గడువు కంటే ముందే అంటే ఈనెల 20వ తేదిలోపు అందజేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ నమోదులో పాల్గొని అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కమీషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, బీఎల్‌ఓలు తదితరులు ఉన్నారు.
https://www.dharshininews.com/43728/