schedule Friday, July 10, 2026

గ్రీన్‌ సీటిలో జోరుగా ఎస్ఐఆర్‌

calendar_today July 10, 2026
person dharshininews
గ్రీన్‌ సీటిలో జోరుగా ఎస్ఐఆర్‌
గ్రీన్‌ సీటిలో జోరుగా ఎస్ఐఆర్‌ - ఓటర్లకు సహకరించిన నేతలు - దగ్గరుండి ఫారాలలో వివరాల నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 13వ వార్డు గ్రీన్‌సీటిలో ఓటర్ల సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) కార్యక్రమం జోరుగా కొనసాగింది. శుక్రవారం వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్‌, కోఆప్షన్ సభ్యులు సరిత హరిగౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్‌ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వార్డులోని ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫారాలను నింపి సహాకారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని ఓటర్లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించారు. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. బీఎల్‌ఓల ద్వారా అందుకున్న ఎన్యుమరేషన్ ఫారాలలో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే శిబిరం వద్దకు వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హరి హర గౌడ్, రమేష్ గౌడ్, మాక్సుద్, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43744/