schedule Friday, July 10, 2026

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

calendar_today July 10, 2026
person dharshininews
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ - ప్రతి ఇంట్లో పచ్చదనం పెంచాలి - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 24, 1, 4, 5 వార్డులలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చైర్ పర్సన్ నీరజా బాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు, మైప్మా సిబ్బందితో కలిసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రతి వార్డులో ప్రతి ఇంటా మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. కావున పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43737/