schedule Saturday, September 05, 2026

ఎవ్వరు ఓటు హక్కును కోల్పోరాదు..!

calendar_today July 10, 2026
person dharshininews
ఎవ్వరు ఓటు హక్కును కోల్పోరాదు..!
ఎవ్వరు ఓటు హక్కును కోల్పోరాదు..! - ఎస్‌ఐఆర్ నమోదు అందరి బాధ్యత - నమోదులో ఎలాంటి గాబారా పడరాదు - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి - హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించిన ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన ఓటర్లు ఎవ్వరు ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌ డెస్క్‌ కేంద్రాలను చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఓటర్ల నుంచి ఎస్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియను పరిశీలించారు. హెల్ప్‌ డెస్క్‌ల నుంచి ఓటర్లకు అందిస్తున్న సహాయ సహాకారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఎస్‌ఐఆర్(ఓటర్ల జాబిత సమగ్ర సవరణ)లో అందరు పాల్గొనాలని అన్నారు. ఓటర్లు అందుకున్న ఎన్యుమరేషన్ ఫారాలలో వివరాలు నమోదు చేసి బీఎల్‌ఓలకు అందించాలన్నారు. వివరాల నమోదులో ఎలాంటి గాబారా పడకుండా ఉండేందుకు హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఫారాలలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అప్పుడే ఓటర్ల ఓటు హక్కు సురక్షితంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు ఫారాలు నమోదు చేసి అందించాలన్నారు. వివరాల నమోదులో అనుమానాలు ఉంటే హెల్ప్‌ డెస్క్‌ల వద్ద బీఎల్‌ఓలు, బీఎల్‌ఏల సహాకారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డుల పెద్దలు, యువకులు, ఓటర్లు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/43738/