schedule Friday, July 10, 2026

బైపాస్‌ నిర్వాసితులకు ఊరట

calendar_today July 10, 2026
person dharshininews
బైపాస్‌ నిర్వాసితులకు ఊరట
బైపాస్‌ నిర్వాసితులకు ఊరట - పెంచిన పరిహారాన్ని అందిస్తాం - త్వరలోనే రైతుల ఖాతాలో జమ - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి పెంచిన పరిహారం అందించబోతున్నట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 13 సంవత్సరాలుగా తాండూరు బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులు 140 మంది రైతుల ఎదురుచూపులకు ఊరట లభించిందని అన్నారు. నిర్వాసితుల కోసం ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందని తెలిపారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ఖాతాలో రూ.25,13,01,000 (రూ.25.13 కోట్లు) జమ కావడం జరిగిందన్నారు. గతంలో నిర్ణయించిన పరిహారంను పెంచి మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. భూ నిర్వాసితులకు పెరిగిన నష్టపరిహారం అందించబోతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబుల భూ నిర్వాసితులకు నష్టపరిహారం మంజూరైందని తెలిపారు. భూ నిర్వాసితుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మరోవైపు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషిలో పరిహారం నిధులు మంజూరు కావడం భూ నిర్వాసితులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. https://www.dharshininews.com/43742/