జల పరవళ్లు..!
August 3, 2022
dharshininews
జల పరవళ్లు..!
- అలుగు పారిన జుంటుపల్లి ప్రాజెక్టు
- పలు గ్రామాలకు రవాణా అంతరాయం
యాలాల, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో ప్రముఖ జుంటుపల్లి ప్రాజెక్టుకు జల పరువం సంతరించుకుంది. అలుగు పారి జల పరువళ్లలతో సందడి చేస్తోంది. మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరధనీరు చేరింది. దీంతో అలుగు పైనుంచి నీరు ముత్తడి దూకి ప్రవహిస్తుంది. మరోవైపు ప్రాజెక్టు నుంచి వరధ నీరు ప్రవహించడంతో కోడంగల్ నియోజకవర్గంలోని నాగారం, అన్నారం, రుద్రారం, యాలాల మండలం పటేల్ చింత తండాలకు రాకపోకలు స్థంభించాయి. వరధ ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

