schedule Sunday, September 13, 2026

రేణుకా ఎల్ల‌మ్మ‌కు గాజుల మాల‌

calendar_today August 12, 2022
person dharshininews
రేణుకా ఎల్ల‌మ్మ‌కు గాజుల మాల‌
రేణుకా ఎల్ల‌మ్మ‌కు గాజుల మాల‌ - ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన అమ్మ‌వారు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణం నెహ్రు గంజ్‌లో వెల‌సిన శ్రీ రేణుకా నాగ ఎల్ల‌మ్మ ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. శ్రావ‌ణ మాసం మూడో శుక్ర‌వారంను పుర‌స్క‌రించుకుని అమ్మ‌వారికి గాజుల‌తో త‌యారు చేసిన మాల‌ను అలంక‌ర‌ణ చేశారు. శ్రావ‌ణ శుక్ర‌వారం సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు కొన‌సాగాయి. ప్ర‌తిరోజు అమ్మ‌వారికి మ‌హా హ‌ర‌తి, ప్ర‌తి శుక్ర‌వారం ల‌లితా స‌హాస్ర నామ‌పారాయ‌ణాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య పూజారి అమ్రేష్ తెలిపారు. మ‌రోవైపు అమ్మ‌వారికి గాజుల‌తో ప్ర‌త్యేక అలంక‌ర‌ణ చేసిన విష‌యం తెలుసుకున్న భ‌క్తులు, మ‌హిళ‌లు ఆలయానికి చేరుకుని అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.