schedule Friday, July 10, 2026

త్రివర్ణ శివుడు..!

calendar_today August 15, 2022
person dharshininews
త్రివర్ణ శివుడు..!
త్రివర్ణ శివుడు..! - ప్రత్యేక అంకరణలో దర్శనం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయానికి త్రివర్ణ శోభ సంతరించుకుంది. శ్రావణ సోమవారం, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి దేవాలయంలో వెలసిన శివలింగానికి జాతీయ పతాకలంకరణ చేశారు. ఉదయం జాతీయ జెండాతో మువ్వెన్నెలతో అలంకరణ చేయగా సాయంత్రం కూరగాయలతో త్రివర్ణ శివునిగా అలంకరణ చేశారు. దీంతో ఆయంలో తిరంగా సందడి నెలకొంది. దేశ భక్తులు, దైవ భక్తులు ఆలయానికి చేరుకుని శివున్ని దర్శించుకున్నారు.