వేపాకులతో దర్శనమిచ్చిన రేణుకా ఎల్లమ్మ
August 19, 2022
dharshininews
వేపాకులతో దర్శనమిచ్చిన రేణుకా ఎల్లమ్మ
- దర్శించుకున్న మహిళలు, భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవారిని వేపాకులతో అలంకరణ చేశారు. నిండైన వేపాకుల మద్య రేణుకా ఎల్లమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందే అమ్మవారికి అభిషేకం నిర్వహించిన తరువాత ఈ ప్రత్యేక అలంకరణ చేశారు. తరువాత అమ్మవారికి మహా హారతిని సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు, భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. సల్లంగా దీవించు ఎల్లమ్మ తల్లీ అంటూ అమ్మవారిని వేడుకున్నారు. మరోవైపు శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి అంమ్రేష్ తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞఫ్తి చేశారు.