ఐక్యతను చాటుదాం
August 26, 2022
dharshininews
ఐక్యతను చాటుదాం
- వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందాం
- సన్నాహాక సమావేశంలో తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని వర్గాల సమన్వయంతో తాండూరును ఐక్యతకు నిదర్శంగా చాటుదాదమని డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పోలీసు శాఖ, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి వినాయక మండపాల నిర్వహకులకు చవితి, నిమజ్జన నిబంధనలపై అవగాహన కల్పించారు. చవితి నుంచి నిమజ్జనం వరకు అందరు పోలీసు శాఖ, హిందూ ఉత్సవ సమితి సూచించిన నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ పండగల సమయాల్లో తాండూరులో అన్ని వర్గాలు సమన్వయం పాటిస్తారని, అదే ఐక్యమత్యాన్ని చాటుకోవాలని అన్నారు. వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అందరు సహకరించాలన్నారు. మండపాల నిర్వహకులు నిబంధనలు పాటించి శాంతియుంతగా పండగను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండపాల నిర్వహకులు, యువకులు, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.