శరన్నవరాత్రుల వసతులకు చర్యలు
September 22, 2022
dharshininews
శరన్నవరాత్రుల వసతులకు చర్యలు
- మున్సిపల్ అధికారులకు బీజేపీ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే శరన్నవరాత్రుల ఉత్సవాలకు ఆలయాలు, మండపాల వద్ద వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తాండూరు బీజేపీ నేతలు కోరారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్న సందర్భంగా పట్టణంలోని దేవీ ఆలయాలు, మండపాల వద్ద విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి వసతిని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరు. తొమ్మిది రోజులు పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దృష్టిసారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పొల శ్రీను, యువనాయకులు అంతారం కిరణ్ తదితరులు ఉన్నారు.