schedule Thursday, September 17, 2026

చిరస్మ‌రణీయుడు విఠ‌ల‌ప్ప‌

calendar_today October 11, 2022
person dharshininews
చిరస్మ‌రణీయుడు విఠ‌ల‌ప్ప‌
చిరస్మ‌రణీయుడు విఠ‌ల‌ప్ప‌ - నివాళులు అర్పించిన అభిమానులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఎంద‌రో పేద‌ల‌కు సేవ‌లందించిన మ‌హోన్న‌తుడు స్వ‌ర్గీయ విఠ‌ల‌ప్ప అంటూ అభిమానులు కొనియాడారు. మంగ‌ళ‌వారం యాలాల మండ‌లం తిమ్మాయిప‌ల్లిలో విఠ‌ల‌ప్ప 8వ వ‌ర్ధంతి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న అభిమానులు విఠ‌ల‌ప్ప విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా జుంటుప‌ల్లి వెంక‌ట్, రాము ముదిరాజ్, గ్రామ‌స్తులు త‌దిత‌రులు మాట్లాడుతూ విద్యాదాత.. పేదల పెన్నిధి విఠ‌ల‌ప్ప అని అన్నారు. పేద ప్రజలకు ఆయ‌న అందించిన సేవ‌లు గుర్తుండిపొతాయ‌న్నారు. ఆయ‌న పేద‌ల గుండ‌ల్లో చిర‌స్మ‌ర‌ణీయుడుగా నిలిచిపోతార‌ని అన్నారు. విఠ‌ల‌ప్ప అడుగు జాడ‌ల్లో ముందుకు సాగాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ‌స్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.