schedule Sunday, September 20, 2026

గ్రూప్‌-4లో తాండూరు కందిపై ప్రశ్న

calendar_today July 2, 2023
person dharshininews
గ్రూప్‌-4లో తాండూరు కందిపై ప్రశ్న
గ్రూప్‌-4లో తాండూరు కందిపై ప్రశ్న - హర్షం వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు, రైతులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు కందికి మరో గౌరవం దక్కింది. కందిపప్పు అంటే తాండూరు కందిపప్పే అందరికి గుర్తువస్తుంది. ఎంతలా అంటే ప్రపంచ వ్యాప్తంగా కందిపప్పు ఫేమస్‌ అయ్యింది. రుచిలో సాటిలేని మేటి గుర్తింపు సాధించిన కందిపప్పుకు ఇటీవలే (జీఐ) భౌగోళిక గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రభుత్వంలో కంది పప్పుకు బ్రాండ్ గుర్తింపు వచ్చింది. తాజాగా శనివారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్‌-4 పరీక్షలో తాండూరు కందికి సంబంధించిన ప్రశ్న వచ్చింది. ప్రశ్నాపత్రంలో 58వ దానిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి వివిధ కార్యక్రమాల ద్వారా వ్యవసాయాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ సందర్భంలో క్రింది జతలను పరిగణించాలని ప్రశ్న ఇచ్చింది. ఇందులో 'ఏ' ఆప్షన్ కింద 2021-22లో తెలంగాణలో స్థూల నీటి పారుదల(జీఐఏ) విస్తీర్ణం : దాదాపు 135 లక్షల ఎకరాలు. 'బీ' ఆప్షన్ కింద తెలంగాణలో వరి ఉత్పత్తి : దాదాపు 202 లక్షల మిలియన్ టన్నులు. 'సీ' ఆప్షన్ కింద 2022-23లో భౌగోళిక సూచిక(జీఐ) ట్యాగ్ అందించబడింది: తాండూరు కందికప్పు అనే దానికి జత/జతలను ఎంపిక చేయాలని ప్రశ్న ఇచ్చింది. గ్రూప్-4 పరీక్షలో తాండూరు కందికప్పుకు సంబంధించిన ప్రశ్న రావడం పట్ల తాండూరు శాస్త్రవేత్తలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18265 chaithany collage