schedule Thursday, July 09, 2026

రద్దయిన రైళ్లను పునరుద్దరించాలి

calendar_today August 6, 2023
person dharshininews
రద్దయిన రైళ్లను పునరుద్దరించాలి
రద్దయిన రైళ్లను పునరుద్దరించాలి - రైల్వే అధికారులకు ఆర్యవైశ్య సంఘం వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని తాండూరు రైల్వే అధికారులను స్థానిక ఆర్యవైశ్య సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్ లో ఏడీఈఈని కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా సమయంలో గుర్బల్గా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కొల్హాపూర్ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లు రద్దయ్యాయని గుర్తుచేశారు. ఈ రైళ్లు సర్వీసు లేకపోవడంతో తాండూరు ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. రద్దయిన ఈ రైళ్లను పునరుద్దరించాలని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కోట మురళీకృష్ణ, దాదాపురం రవీంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19108