schedule Wednesday, July 08, 2026

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

calendar_today August 26, 2023
person dharshininews
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - తాండూరు జూనియన్ సివిల్ జడ్జీ శివలీల - గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు తాండూరు, దర్శిని ప్రతినిధి: చట్టాలపై అందరు అవగాహన పెంచుకోవాలని తాండూరు జూనియర్ జడ్జీ శివలీల అన్నారు. శనివారం యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో తాండూరు మండల లీగల్‌ సర్వీసెస్ కమిటి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి శివలీల హాజరై మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న చిన్న విషయాలపై పోలీస్టేషన్‌లపై ఆధార పడకుండా రాజీ మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. విద్యార్థులు కళాశాల స్థాయి నుంచి చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంచుకున్న లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించాలన్నారు. అదేవిధంగా పలువురు న్యాయవాదులు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పాశం రవి, సంయుక్త కార్యదర్శి రజిత, న్యాయవాదులు కె. శ్రీనివాస్, కె.రవికుమార్, నవల్గా విశ్వనాథ్‌, రామయ్య గౌడ్, నరేందర్ సింగ్, యడ్రామి విశ్వనాథ్, బి.రవికుమార్, గోపాల్, బి.రవికుమార్, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, మహిళ న్యాయవాదులు సోఫియా భేగం, అనిత గుప్త, అనీల, యాలాల ఎస్ఐ అరవింద్, కళాశాల ప్రిన్సిపల్ అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19691