schedule Wednesday, July 08, 2026

ఎవరో.. పాపం..!

calendar_today September 3, 2023
person dharshininews
ఎవరో.. పాపం..!
ఎవరో.. పాపం..! - రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతి - తాండూరు మార్చురికి మృతదేహం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు పక్కగా మృతి చెంది కనిపించాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీ సమీపంలోని శ్రీ సత్య సాయి టిఫెన్‌ సెంటర్ ముందు సుమారు 40 ఏండ్ల వయస్సు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి విగతజీవిగా కనిపించాడు. స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాల కోసం ఆరా తీసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మృతుని వివరాలు తెలియరాలేదని, అతని ఒంటిపై నీలి రంగు షర్టుపై సాయి అనే పేరు ఉందని తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే సెల్‌: 8712670049 లేదా 8712670050 లకు సంప్రదించాలని సూచించారు. మరోవైపు వ్యక్తి మృతికి గల కారణాలు కూడా తెలియరాలేదు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19898