schedule Saturday, September 19, 2026

మందుకు లేదు బంద్..!

calendar_today September 22, 2023
person dharshininews
మందుకు లేదు బంద్..!
మందుకు లేదు బంద్..! - నిమజ్జనం రోజు 'పుల్‌' పర్మిషన్ - క్యూ కడుతున్న మందుబాబులు - విమర్శలు పాలవుతున్న ఎక్సైజ్ శాఖ తాండూరు, దర్శిని ప్రతినిధి: మనల్ని ఏవడ్రా ఆపేది అనే తరహాలో వికారాబాద్‌ జిల్లా తాండూరు మందుబాబులో 'జోష్‌' మీద ఉన్నారు. ప్రతి యేడాది వినాయక నిమజ్జనానికి ముందు తాండూరులో మద్యం విక్రయాలపై నిషేధం ఉండేది. ఈ యేడాది ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో మద్యం విక్రయాలకు 'పుల్‌' పర్మిషన్ లభించింది. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనంకు ముందు 24 గంటల ముందే మద్యం విక్రయాలు మూతపడేముందు మందుబాబులు జోరుగా మద్యం కొనుగోళ్లు చేసేశారు. అధిక డబ్బులు చెల్లించి మద్యం కొనుగోలు చేసేవాళ్లు. ఈ సారి మద్యం విక్రయాలు యధేచ్చగా కొనుగోలు చేయడంతో మందులు మనల్ని ఎవడ్రా ఆపేది అనే తరహాలో మద్యం షాపులకు క్యూ కడుతున్నారు. మందుకు బంద్ లేకపోవడంతో తాగుదాం.. ఊగుదాం... చిందేద్దాం.. జోష్ మీద ఉన్నారు. మరోవైపు తాండూరులో మద్యం విక్రయాలను నిషేధించకపోవడంపై ఎక్సైజ్ శాఖ అధికారులపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మద్యం విక్రయాలపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, అందుకే మద్యం దుకాణాల మూతకు ఆంక్షలు పెట్టలేదని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/20452/