schedule Wednesday, July 08, 2026

అయ్యప్ప దేవాలయంలో వినాయక వైభోగం..!

calendar_today September 22, 2023
person dharshininews
అయ్యప్ప దేవాలయంలో వినాయక వైభోగం..!
అయ్యప్ప దేవాలయంలో వినాయక వైభోగం..! - ఘనంగా భజన, పల్లకి సేవ ఊరేగింపు - మేఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వినాయక ఉత్సవ శోభ సంతరించుకుంది. ప్రతి యేడాది మాదిరిగానే బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో వినాయకున్ని ప్రతిష్ఠించారు. గత ఐదు రోజులుగా వినాయక ఉత్సవ సమితి, అయ్యప్ప స్వామి ఆలయ కమిటితో పాటు తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్, మ హేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వినాయకునికి పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయంలో వినాయక వైభోగం సంతరించుకుంది. శుక్రవారం వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటి నేతృత్వంలో గణేష్, అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం. పల్లకిసేవ ఊరేగింపు నిర్వహించారు. వినాయకుడు, మణికంఠ నామస్మరణతో ఆలయం మార్మోగింది. అనంతరం సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, మహేందర్ గౌడ్ ల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా ఆలయ కమిటి సభ్యులు సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు వెంకట్రావ్, కార్యదర్శి శ్రావణ్ గౌడ్, నరహరి, శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హరిహరగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20459/