రోహితన్న గెలుపే లక్ష్యం..!
November 20, 2023
dharshininews
రోహితన్న గెలుపే లక్ష్యం..!
- ముమ్మర ప్రచారం చేస్తున్న నేతలు
- పాల్గొన్న చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్
- ఇంటింటికి తిరుగుతున్న కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా స్థానిక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు కృషి చె వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తన వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా సాయిపూర్ లోని 9, 10, 11, 12వ వార్డులలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు కూడా ప్రచారంతో హోరెత్తించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు, కౌన్సిలర్ సంగీత ఠాకూర్ కూడా తన వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సాధించిన ప్రగతి కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టారు. తాండూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కార్యకర్తలు, ప్రజలు రోహిత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలతో జై కొట్టారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/22078/