schedule Thursday, September 17, 2026

మెజార్టీతో గెలిపించండి

calendar_today November 20, 2023
person dharshininews
మెజార్టీతో గెలిపించండి
మెజార్టీతో గెలిపించండి - ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి - పట్టణంలో జోరుగా ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి కోరారు. సోమవారం తాండూరు పట్టణంలోని 6వ వార్డులో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున సతీమణి ఆర్తి రెడ్డి చేసిన ప్రచాన్ని వార్డు ప్రజలు ఆదరించారు. వార్డులో ఆర్తీ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ముసలి తాతలను, ముసలవ్వలతో పాటు ఇంటిల్లి పాదిని పలకరించి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ కరపత్రాలను పంచి కారు గుర్తును గుర్తించుకోవాలన్నారు. పెద్దలు ఆశీర్వాదంతో, యువకులు అభిమానంతో ఓటేసి ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలన్నారు. కాంగ్రెస్ మాటలను నమ్మి దగా పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, కౌన్సిలర్ విజయదేవి, బీఆర్ఎస్ మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22081/